![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 974లో.. కాలేజీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ కలిసి ధర్నా చేస్తుంటారు. అసలు వసుధార మేడమ్ గారు ఎండీగా పదవీ చేపట్టిన తర్వాత జీతాలు పెంచమంటే పనే లేకుండా చేశారు. సరే ఉన్న జీతంతో ఎలాగోలా సరిపెట్టుకుందామంటే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. అసలేంటి సర్ ఇలా జరుగుతుందని ఒక మేడమ్ ప్రశ్నిస్తుంది. వసుధార మేడమ్ సంతకం పెట్టందే మాకు జీతాలు పడవు. ఇప్పుడు ఎలా సర్ అని మరో మేడమ్ ప్రశ్నిస్తుంది. వసుధార మేడమ్ వచ్చేస్తారు. తను వచ్చిన వెంటనే అన్నీ క్లియర్ చేసేస్తారని ఆ మేడమ్స్ తో ఫణీంద్ర అంటాడు. లేదు సర్ అప్పటివరకు మేము వెయిట్ చేయం.. రిషి సర్ రావాల్సిందేనని మిగతా ఫ్యాకల్టీతో పాటు స్టూడెంట్స్ కూడా.. వీ వాంట్ రిషీ సర్ అంటు గట్టిగా అరుస్తుంటారు.
రిషి సర్ చనిపోయారు కదా.. ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోతారని ఆ నిజాన్ని కప్పిపుచ్చారు కదా అంటూ స్టూడెంట్స్ ప్రశ్నించగా.. ఏం మాట్లాడుతున్నారు మీరు నిజానిజాలు తెలియకుండా మాట్లాడకండి అని మహేంద్ర చెప్తాడు. అయిన స్టూడెంట్స్ వినకుండా ' వి వాంట్ రిషి సర్' అంటు గట్టిగా అరుస్తూనే ఉంటారు. ఇక కాసేపటికి స్టూడెంట్ గ్రూప్ లో రిషి సర్ చనిపోయాడంటూ ఆర్ఐపీ అని పోస్ట్ ఎందుకు వచ్చిందంటూ మహేంద్ర, ఫణింద్ర , అనుపమలకి చూపిస్తారు. అది చూసి అందరు షాక్ అవుతారు. కాసేపటికి మహేంద్ర తేరుకొని రిషికి ఏం కాలేదు.. ఎక్కడో ఓ చోట బ్రతికే ఉన్నాడని అంటాడు. అతి త్వరలో మా రిషి సర్ మాకు కావాలని స్టూడెంట్స్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిషి జాడ కనుక్కోమని మహేంద్రతో ఫణీంద్ర అంటాడు. దీనితర్వాత ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని కొడుతుంటాడు మహేంద్ర. ఇక అనుపమ మహేంద్రని ఆపుతుంది. నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావని అనుపమ అంటుంది. సమస్యకి పరిష్కారం వెతుక్కోవాలి కానీ ఎమోషనల్ అవ్వకూడదు. రిషి గురించి మాట్లాడటం, జీతాల గురించి అడగడం అన్నీ ఒకేసరి జరిగాయంటే దీని వెనుక శైలేంద్ర ఉన్నాడు. అతని ఆలోచనలని ఎలా తిప్పికొట్టాలో ఆలోచించమని అనుపమ అంటుంది. ఇవన్నీ చెప్తే రిషి ని మనం బయటకు తీసుకొస్తామని శైలేంద్ర ప్లాన్ అని అనుపమ, మహేంద్ర మాట్లాడుకుంటారు.
మహేంద్రకి మినిస్టర్ కాల్ చేస్తాడు. నాకో ఇన్ఫర్మేషన్ వచ్చింది రిషి కన్పించడం లేదంట కదా? కాలేజీలో గొడవ జరుగుతుందంట కదా.. అసలేమైందని మహేంద్రని మినిస్టర్ అడుగుతాడు. అవన్నీ మిమ్మల్ని కలిసి వివరంగా చెప్తానని మహేంద్ర అంటే.. సరే నేను కాలేజీకి వస్తానని మినిస్టర్ కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వసుధారకి మహేంద్ర కాల్ చేస్తాడు. అప్పటివరకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడమే బెటర్ అని వసుధార అంటుంది. ఈ రోజు కాలేజీలో రచ్చ చేశాడని కాలేజీలో జరిగిందని మహేంద్ర అంటాడు. ముందైతే ఆ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ ని తీసేయమని చెప్పండి. సిలబస్ అయ్యేలా చూడాలి. సాలరీస్ ఫైల్ ఈ రోజే చూసి అప్రూవ్ చేస్తానని మహేంద్రతో వసుధార అంటుంది. ఇక కాలేజీ పేజీలో రిషి ఫోటో కింద ఆర్ఐపీ అని పెట్టారంటే అది నా కొడుకే చేసి ఉంటాడని శైలేంద్రకి దేవయాని కాల్ చేస్తుంది. అక్కడేదో చిచ్చు పెట్టినట్టున్నావని దేచయాని అడుగుతుంది. లేదంటే ఆ రిషి గాడు ఎక్కడ ఉన్నాడో బయటపెట్టట్లేదని శైలేంద్ర అంటాడు. ఇక అప్పుడే దేవయానికి ధరణి వస్తుంది. సోషల్ మీడొయాలో ఇలా వచ్చిందని ధరణి అడుగగా.. ఏమో నిజమేమోనని దేవయాని అంటుంది. అత్తయ్య.. అలాంటి అపశకునం మాటలు నోటికెలా వస్తాయి. అది నోరా ఇంకేమన్నానా అని ధరణి గట్టిగా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |